NTV Telugu Site icon

విశాఖలో దారుణం… శిశువు బతికి ఉండగానే ఖననానికి యత్నం

విశాఖలో దారుణం చోటు చేసుకుంది. శిశువు బతికి ఉండగానే ఖననానికి యత్నించారు. కాన్వెంట్ జంక్షన్ లో ఉన్న చావుల మదం శ్మశాన వాటికలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని శిశువును బతికి ఉండగానే పూడ్చేయాలని కోరుతూ శ్మశాన వాటికకు వచ్చారు నలుగురు వ్యక్తులు. కవర్లో ఉంచిన శిశువును పాతిపెట్టాలని కోరారని తెలిపారు శ్మశాన వాటిక సిబ్బంది. పాతిపెట్టేందుకు కవర్‌ తెరవగా శిశువు ఏడవటం ప్రారంభించిందన్నారు సిబ్బంది. బతికి ఉండగానే ఎందుకు ఖననం చేస్తున్నారని ప్రశ్నించగా.. ఆ నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. అనంతరం శిశువును సమీపంలోని హాస్పిటల్ లో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కంచరపాలెం పోలీసులకు శ్మశాన వాటిక సిబ్బంది ఫిర్యాదు చెయ్యగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.