Site icon NTV Telugu

Snake in Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై కలకలం.. క్యూలైన్‌లోకి వచ్చిన పాము

Snake

Snake

Snake in Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన బెజవాడ దుర్గమ్మ ఆలయంలో పాము కలకలం సృష్టిచింది.. దుర్గగుడిలో ఉచిత క్యూలైన్‌లోకి పాము పిల్ల వచ్చింది.. కిటికీలో నుంచి క్యూలైన్‌లోకి కట్ల పాము వచ్చినట్టు చెబుతున్నారు.. అయితే, పాము చూసిన భక్తులు.. భయంతో పరుగులు తీశారు.. క్యూలైన్‌లో ఉన్న భక్తులు పామును చూసి వణికిపోయారు.. కొందరు కేకలు వేశారు.. అయితే, వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది.. కర్ర సాయంతో పామును కిటికీలో నుంచి బయటకి పంపించారు.. ప్రమాదం తప్పడంతో క్యూలైన్‌లో ఉన్న భక్తులతో పాటు.. ఆలయ సిబ్బంది, దుర్గగుడి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు..

Read Also: Vallabhaneni Vamsi Mohan: కామెడీ.. జూ.ఎన్టీఆర్‌ను లోకేష్‌ పార్టీలోకి ఆహ్వానించడం ఏంటి..?

అయితే, ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద పాము కనిపించడం ఇదే తొలిసారి కాదు.. ప్రధాన ఆలయానికి వెళ్లే క్యూలైన్ మార్గంలో గతంలోనూ పాము కనిపించడంతో భక్తులు భయాందోళనలకు లోనయ్యారు. దీంతో రంగంలోకి దిగిన ఆలయ సిబ్బంది క్యూలైన్ ను నిలిపివేసి పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆలయ క్యూలైన్ వద్ద కలుగులు ఉండటంతో సిబ్బంది అక్కడ తవ్వకాలు చేపట్టారు. పాములు పట్టేవారికి అధికారులు సమాచారం అందించారు. మరోపక్క, పాము కనిపించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందుగానే భక్తులను ఆపేసిన ఘటన గతంలో జరిగింది..

Exit mobile version