NTV Telugu Site icon

Shocking Incident: చనిపోయాడు, అంత్యక్రియలు చేశారు.. కర్మకాండల రోజు తిరిగి వచ్చాడు..!

Shocking Incident

Shocking Incident

కొన్ని సార్లు ఊహించని పరిణామాలు కొందరికి షాక్‌ ఇస్తాయి.. వాటి నుంచి తేరుకోవడం కూడా కష్టమే.. ఇక, ఒక మనిషి జీవితంలో పుట్టుక, చావు రెండే కీలకమైనవి.. మధ్యలో బాగోతం అంతా కొన్నినాళ్లే.. అయితే, ఓ వ్యక్తి 40 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు.. ఇటీవల ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు.. తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.. కర్మకాండలు నిర్వహించి బంధువులకు భోజనాలు పెడుతున్న సమయంలో.. సడెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు.. చనిపోయాడు అనుకున్న వ్యక్తి ఒక్కసారిగి ప్రత్యక్షం కావడంతో.. మొదట షాక్‌ తిన్న కుటుంబ సభ్యులు తర్వాత ఆనందంలో మునిగిపోయారు.

Read Also: Parliament Monsoon Session: పార్లమెంట్‌ను కుదిపేసిన అధిర్ వ్యాఖ్యలు.. ఉభయసభలు రేపటికి వాయిదా

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో జరిగిన ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గిద్దలూరు మండలం ముర్లపాడుకు చెందిన సయ్యద్ మియా అనే వ్యక్తి 40 రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయాడు.. అయితే, ఇటీవల పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.. అతడికి సయ్యద్ మియాకు దగ్గరి పోలికలు ఉండడంతో.. చనిపోయిన మరో వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు… కర్మకాండలు నిర్వహించి బంధువులకు భోజనాలు పెడుతున్న సమయంలో చనిపోయాడు అనుకున్న వ్యక్తి ప్రత్యక్షమై అందరికీ షాక్‌ ఇచ్చాడు. ఊహించని ఘటనతో అవాక్కైన కుటుంబ సభ్యులు, బందువులు.. చనిపోయాడనుకున్న సయ్యద్ మియా తిరిగి రావటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

Show comments