ఒకవైపు సంక్రాంతి… మరోవైపు గోదావరి జిల్లాల్లో కోడిపందాలు, క్యాసినోలు, గుండాటలు.. తెలుగు రాష్ట్రాల్లో చికోటి ప్రవీణ్ పేరు పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. ప్రముఖ క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా్లో ప్రయాణిస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది. ఆయన ప్రయాణిస్తున్న కార్లను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆపేశారు. నగరం పోలీసులు తనిఖీ చేశారు.
నగరం పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా చికోటి ప్రవీణ్ మిత్రబృందం కార్లు వచ్చాయి. దీంతో వారు ప్రయాణిస్తున్న నాలుగు కార్లు నిలిపివేశారు. రెండు గంటలపాటు చీకోటి ప్రవీణ్ ను పోలీసులు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా తాను క్యాసినో ఆడేందుకు కోనసీమకు రాలేదంటున్నారు ప్రవీణ్.ఇక్కడ ఆలయాలు సందర్శిస్తున్నానని ప్రవీణ్ చెప్పారు.
పోలీస్ తనిఖీల అనంతరం చీకోటి ప్రవీణ్. ఈస్ట్ గోదావరి జిల్లా మామిడికుదురు సమీపంలో ప్రవీణ్ చికోటిని అడ్డుకున్నారు పోలీసులు. లక్ష్మీనారాయణ స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో అడ్డుకున్నారు పోలీసులు, 4 వాహనాలను రోడ్ పై నిలిపివేశారు పోలీసులు. ఎలాంటి కారణాలు చెప్పకుండా అడ్డుకోవడంతో చికోటి ప్రవీణ్ నిరసన తెలిపారు.
Read Also:Sankranthi Festival Bhakthi Tv Live: సంక్రాంతి నాడు ఈ పూజలు చేస్తే అన్నీ శుభాలే