YS Sharmila : బెంగళూరులో హైడ్రామా.. యలహంక ఇంటికి వెళ్లేందుకు షర్మిల, విజయమ్మ ప్రయత్నం

  • జగన్ యలహంక నివాసానికి వెళ్లే ప్రయత్నం
  • ఎయిర్‌పోర్టు వద్ద అడ్డుకున్న పోలీసులు
  • 20 నిమిషాల పాటు తీవ్ర వాగ్వాదం
  • చివరికి లీలా ప్యాలెస్‌కు షర్మిల, విజయమ్మ
Ys Sharmila

Ys Sharmila

బెంగళూరులో వైఎస్ జగన్ యలహంక నివాసానికి వెళ్లేందుకు వైఎస్ షర్మిల, విజయమ్మ చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టు ఆదేశాలు ఉన్నాయని, వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. యలహంక ఇంటికే వెళ్తామంటూ షర్మిల పట్టుబట్టగా, పోలీసులు అనుమతి నిరాకరించారు.

ఎయిర్‌పోర్టు వద్ద 20 నిమిషాల వాగ్వాదం

బెంగళూరు ఎయిర్‌పోర్టు వద్ద షర్మిల, విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాలను చూపుతూ ముందుకు వెళ్లేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. దీంతో షర్మిల, పోలీసుల మధ్య సుమారు 20 నిమిషాల పాటు వాగ్వాదం జరిగింది. తాము యలహంక ఇంటికి వెళ్లి తీరుతామని షర్మిల పట్టుబట్టారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున జగన్ నివాసం వద్దకు అనుమతించలేమని పోలీసులు తేల్చి చెప్పారు. చివరికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో షర్మిల, విజయమ్మ అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం వారు హోటల్ లీలా ప్యాలెస్‌కు బయలుదేరి వెళ్లారు.