Site icon NTV Telugu

ఏపీ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

ఏపీ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో మంత్రలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడారు.ఇతరులకి సహాయపడటమే నిజమైన పండుగ అని ఆయన అన్నారు. మాటకోసం పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. ప్రజల‌కోసం పనిచేసే సీఎంకు అందరూ మద్దతుగా నిలబడాలన్నారు. కొన్ని దుష్ట శక్తులు పన్నాగాలతో సీఎం వైఎస్‌ జగన్‌పై కుట్రలు చేస్తున్నాయన్నారు. బాపట్ల ప్రజలకి, దేవుడికి, సీఎం వైఎస్ జగన్‌కి రుణపడి ఉంటానని తెలిపారు. ప్రజలందరికీ క్రిస్మస్‌ , నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

https://ntvtelugu.com/cm-jagan-will-visit-kadapa-and-launch-development-programs/


అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. గతేడాది కోవిడ్‌ కారణంగా క్రిస్మస్‌ నిర్వహించుకోలేకపోయామన్నారు. వ్యాక్సినేషన్ వచ్చేంతవరకు కోవిడ్ అడ్డుకట్ట పడలేదన్నారు. కోవిడ్‌ సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌ కఠిన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. చేదు జ్ఞాపకాల నుంచి తేరుకుని తగిన జాగ్రత్తలతో పండగలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ లో పుట్టిన వారిలో మేజిక్ ఉన్నట్టుంది…సమాజ పరివర్తన తీసుకురావడంలో ముందుంటారన్నారు. సీఎం వైఎస్ జగన్‌ కూడా డిసెంబర్‌ 21న పుట్టారన్నారు. గత ప్రభుత్వ సమయంలో ఆయన పై అసెంబ్లీలో ఎంతలా తప్పుగా మాట్లాడినా ఆయన దేవుడినే నమ్ముకున్నారన్నారు. విద్యార్థులకి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ఇస్తే కొందరూ దుర్మార్గులు తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. అన్ని మతాలని గౌరవించే ప్రభుత్వం మాదేనని చెప్పారు. మీ అందరి ప్రార్థనల వల్లే వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. క్రైస్తవుల అవసరాలు తీర్చడానికి… భద్రతకి మా ప్రభుత్వం అండగా ఉంటుందని, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా మూడు దశాబ్దాలకు పైగా సేవలందించాలని ఆదిమూలపు సురేష్‌ ఆకాంక్షించారు.

Exit mobile version