తీర ప్రాంతంలో మళ్లీ అలజడి మొదలైంది.. హుదూద్ తుఫాన్ తర్వాత ఆ స్థాయిలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి… విజయనగరం జిల్లా భోగాపురం మండలం, ముక్కాం సమీపంలో సముద్రంలో అల్లకల్లోలంగా మారింది.. తీరంలో ఐదు మీటర్ల ఎత్తున సముద్ర కెరటాలు ఎగసిపడుతున్నాయి.. సుమారు 150 మీటర్ల వరకు సముద్రం ముందుకు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు.. అలల తాకిడికి తీరం వెంబడి ఉన్న రహదారులు కోతకు గురయ్యాయి.. కొన్ని చోట్ల పూర్తిగా ధ్వంస అయ్యాయి…. ఇప్పటికే సముద్రం ఒడ్డున ఉన్న రెండు రచ్చబండలు, వలలు భద్రపరుకునే పాకలు సైతం కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు.. రాకాసి అలలు విరిచుకుపడుతుండడంతో తీరప్రాంతంలోని మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు.
Read Also: India Economy: ఆసియాలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ఎకానమీగా ఇండియా
మరోవైపు.. గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది… ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తం చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ… వరద ఉధృతిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నారు.. సహాయక చర్యలకోసం అల్లూరి జిల్లా కూనవరం, వి.ఆర్ పురంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను దించారు.. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులు సూచిస్తున్నారు.. లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని స్పష్టం చేస్తున్నారు.