Scrub Typhus Ravaging AP: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల స్క్రబ్ టైఫస్ వ్యాధి తీవ్రత పెరిగింది. పురుగు కుట్టడం ద్వారా సంక్రమించే ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో భయాందోళన వాతావరణం నెలకొంది. తాజాగా మరో వ్యక్తి మృతి చెందడంతో, స్క్రబ్ టైఫస్ కారణంగా సంభవించిన మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ తాజా మృతి కృష్ణా జిల్లాలో నమోదైంది. ఉయ్యూరు మండలం, మొదునూరు గ్రామానికి చెందిన 44 ఏళ్ల వ్యక్తి శివశంకర్, స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మరణించారు. ఈ నెల రెండవ తేదీన వైద్య పరీక్షల కోసం ఆయన నుంచి వైద్య బృందం శాంపుల్స్ సేకరించింది.
అయితే, దురదృష్టవశాత్తూ, వైద్య పరీక్షల రిపోర్ట్ వచ్చే లోపే శివశంకర్ మరణించారు. ఆయనకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా ఉన్నట్లు ఇవాళ (డిసెంబర్ 6) తేలింది. మృతి చెందిన వ్యక్తికి కిడ్నీ సమస్య కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ మరణాల నేపథ్యంలో, వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా నివారించడానికి, మొదునూరు గ్రామంలో జిల్లా వైద్య బృందం సర్వే చేపట్టింది. స్క్రబ్ టైఫస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
Pakistan Woman: “సార్, నాకు న్యాయం చేయండి”.. ప్రధాని మోడీకి పాకిస్తాన్ మహిళ విజ్ఞప్తి
