Site icon NTV Telugu

Srisailam: శ్రీశైలం ఆలయంలో రేపటి నుంచి స్పర్శ దర్శనాలు

శ్రీశైలం వెళ్లే భక్తులకు మల్లన్న ఆలయ అధికారులు శుభవార్త అందించారు. భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు భక్తులకు స్పర్శ దర్శనాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులను ఆదేశాల మేరకు జిల్లా అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. రేపటి నుంచి ఐదు రోజుల పాటు అభిషేకం చేయించుకునే వారికి స్పర్శదర్శనం కల్పిస్తామన్నారు. అలాగే గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఉచితంగా సాధారణ భక్తులకు స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు వివరించారు.

Read Also: Tirumala: మందకొడిగా ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల బుకింగ్

శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఈ నెల 22 నుంచి మార్చి 4 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఆ సమయంలో స్పర్శ దర్శనాలు, అభిషేకాలు నిలిపివేసి తర్వాత మళ్లీ పునరుద్ధరిస్తారు. కరోనా కారణంగా జనవరి 19 నుంచి గర్భాలయంలో స్పర్శ దర్శనాలు, అభిషేకాలను అధికారులు నిలిపివేశారు. తిరిగి రేపటి నుంచి ప్రారంభించనున్నారు.

Exit mobile version