BRS Flexi in AP: ఏపీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఈ సంక్రాంతి సంబరాల్లో మునిగితేలడమే కాకుండా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి సంబరాలను రెట్టింపు చేస్తూ ఏపీ ప్రజలకు తమ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ప్లెక్సీలు వెలిశాయి. ఈనేపథ్యంలో.. ముఖ్యంగా సాటి తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ బలోపేతానికి ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది బీఆర్ఎస్ అదిష్టానం. ఇందులోభాగంగా.. సంక్రాంతి పండగను ఏపీ బిఆర్ఎస్ నాయకులు వాడుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను కేసీఆర్ నియమించారు. అలాగే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పార్థసారథి, మరికొందరు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన విసయం తెలిసిదే. ఈనేపథ్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు ప్రారంభించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
Read also: ATM Theft: జగిత్యాల జిల్లాలో భారీ చోరీ.. ఏటీఎంలో సీసీ కెమెరాలు మూసేసి రూ.19 లక్షలు..
ఏపీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పలు జిల్లాలు, ప్రధాన నగరాల్లో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో కూడిన భారీ ప్లెక్సీలు వెలిశాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లలో బీఆర్‌ఎస్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. విజయవాడ, గుంటూరు, కడియం, కాకినాడ, కడియం, ముమ్మిడివరం, ముక్కామల, యానాం తదితర ప్రాంతాల్లోనూ బీఆర్ఎస్ ప్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో కూడిన భారీ ప్లెక్సీని ఏపీ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో భారత రాష్ట్ర సమితిపైనా, కేసీఆర్ జాతీయ రాజకీయాలపైనా ప్రజల్లో చర్చ సాగుతోంది.
Read also: Vande Bharat Ticket Rates: నేడే వందేభారత్ రైలు ప్రారంభం.. టికెట్ రేట్లు ఇవీ..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ ఇప్పటికే సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తోంది. ఇలా హైదరాబాద్‌లో నివసిస్తున్న సెటిలర్లతో పాటు ఆంధ్రా ప్రజలను కూడా ప్రసన్నం చేసుకునేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు ఆంధ్రులను అవమానించిన కేసీఆర్, టీఆర్ ఎస్ నేతలు ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలపై విమర్శలు గుప్పిస్తున్నా.. ఇవేమీ పట్టించుకోకుండా ఏపీలో బీఆర్ఎస్ రాజకీయం కొనసాగుతోంది. అయితే.. జనసేన పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరిన తోట చంద్రశేఖర్ రాష్ట్ర బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ప్లెక్సీలు, పోస్టర్లతో బీఆర్ఎస్ పార్టీని ప్రచారం చేస్తున్నారు. అయితే ఆంధ్రా వ్యతిరేక పార్టీగా ముద్రపడిన టీఆర్‌ఎస్ నుంచి పుట్టిన బీఆర్‌ఎస్‌ను ఏపీ ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూడాలి.
Delivery Boy: కుక్క దాడిలో డెలివరీ బాయ్ మృతి.. గత మూడు రోజులుగా కోమాలో..