Site icon NTV Telugu

ఏపీలోనూ విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు..?

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజుకు దాదాపు రెండు లక్షల పైనే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఏపీలోనూ విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే అంశంపై ప్రభుత్వం అధికారులతో విస్తృతంగా చర్చిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లు నడిపే విషయంలో విద్యాశాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.

Read Also: కోడి పందాలు జూదం కాదు.. సంస్కృతి : మంత్రి రంగనాథరాజు

దీంతో ఏపీలోనూ ఈనెల 30 వరకు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపు అంశంపై సోమవారం నాడు ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు 13.87 శాతం నమోదవుతోంది. రానున్న 15 రోజుల్లో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు విద్యాశాఖ అధికారులు సమావేశమై విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపు అంశం, ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Exit mobile version