Salaar : సలార్ సినిమా ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్..ప్రభాస్ ఫ్యాన్ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా సలార్ మూవీ విడుదలైంది.. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన డార్లింగ్ సినిమా బొమ్మ థియేటర్లలో పడటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. సినిమా విడుదల అవుతుందన్న వారం ముందు నుంచే థియేటర్లను ముస్తాబు చేసి అందంగా తయారు చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు.. ఈ క్రమంలో కొందరు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు.. తాజాగా ఓ అభిమాని విధ్యుత్ షాక్ గురై ప్రాణాలను వదిలాడు.. ఈ విషాద ఘటన సత్యసాయి జిల్లాల్లో వెలుగుచూసింది..
వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని రంగ థియేటర్ ఎదుట గురువారం ఒక ఇంటిపై ఫ్లెక్సీ కడుతూ హీరో ప్రభాస్ అభిమాని బాలరాజు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.. తమ అభిమాన హీరో నటించిన సలార్ శుక్రవారం విడుదలకానుండడంతో అనంతపురం తపోవనానికి చెందిన బాలరాజు.. అతడి స్నేహితులు ఫ్లేక్సీ ఫ్రేమ్ తయారు చేయించి స్వయంగా వారే కడుతుండగా.. ఫ్రేమ్ కు ఉన్న ఇనుప చువ్వ ఇంటిపై ఉన్న కరెంట్ తీగలను తాకడంతో కరెంట్ షాక్కు గురై బాలరాజు అక్కడే ప్రాణాలను కోల్పోగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు తగిలాయి..
Also Read
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
మృతిచెందిన బాలరాజు దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. కొంతకాలంగా కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో నివాసం ఉంటున్నాడు. బాలరాజు హీరో ప్రభాస్ వీరాభిమాని. మృతుడికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు ఉన్నారు.అతని మరణంతో నగర వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.. గత రాత్రి మృతుడి బంధువులు, ప్రభాస్ అభిమానులు నిరసన తెలిపారు. కరెంట్ తీగలు తక్కువ ఎత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాలరాజు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు…
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!