రెండురోజుల పాటు గుంటూరులో నిర్వహించిన వైసీపీ ప్లీనరీ విజయవంతం అయిందని వైసీపీనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్లీనరీ నభూతో న భవిష్యత్తు లా జరిగింది. పార్టీ పండుగ కోసం అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు ఉప్పెనలాగా వచ్చారు. ప్లీనరీతో టీడీపీ, దత్త పుత్రుడు, టీడీపీ మీడియా చేస్తూ వచ్చిన అబద్దాలన్నీ పటాపంచలు అయ్యాయి. ఈ వాస్తవం చంద్రబాబుకు మింగుడు పడడంలేదని మండిపడ్డారు.
గేమ్ మార్చి స్పీడ్ పెంచి ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోనే ఉన్నట్లు భ్రమలు తన చుట్టూ పెట్టుకుంటాడు చంద్రబాబు. కంకర, సిమెంట్, సిమెంట్ వంటివి లేకుండానే చంద్రబాబు హయాంలో నిర్మాణాలు చేసే వాళ్ళేమో. చేతిలో ఏమీ లేకపోయినా మాయాబజార్ సృష్టించగలిగిన వ్యక్తి చంద్రబాబు. మైనింగ్ శాఖ సమర్ధవంతంగా వ్యవహరించటం వల్లే ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది, అవార్డులు వస్తున్నాయన్నారు సజ్జల.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిలో భవనాలు లేకపోయినా ఎడారి ప్రాంతంగా మార్చి అమెరికాలా భ్రమలు కల్పించారని సజ్జల మండిపడ్డారు. మట్టి, సిమెంట్, ఇసుక ఉపయోగించకుండా నిర్మాణాలు చేపట్టారేమో? అన్నట్లుగా చంద్రబాబు స్టేట్‌మెంట్ చూస్తే అనిపిస్తోంది. అనాదిగా ఏ ప్రభుత్వం ఉన్నా..నిర్మాణాలు జరగాలంటే మైనింగ్ జరగాల్సిందే. ఇప్పుడే చంద్రబాబు దీని గురించి ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఏవేవో జరిగిపోతున్నాయని ఒక ఉద్యమంలా ఫోటోలు చూసించి ఘోరాలు జరిగిపోతున్నాయని ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు? అని సజ్జల విమర్శించారు.
ఒక పక్క రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడ మట్టి తోలకుండా, ఇసుక తోలకుండా నిర్మాణాలు ఎలా జరుగుతాయి. వీటన్నింటిని అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోంది. చట్ట ప్రకారం కాకుండా విరుద్ధంగా జరుగుతుంటే అడ్డగించవచ్చు. అది కూడా ప్రభుత్వం స్పందించకపోతే మీరు మాట్లాడవచ్చు. మా ప్రభుత్వానికి అవార్డులువస్తున్నాయి. రెవెన్యూ పెరిగింది. ప్రజల సొమ్ము వృథా కాకూడదని చూస్తున్నాం. ప్రభుత్వంలో అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. వారం పది రోజుల్లో చంద్రబాబు చెబుతున్న అబద్ధాలన్నీ నిజాలు కావన్నారు సజ్జల,
