చంద్రబాబు కుటుంబం డ్రగ్స్ బిజినెస్..! వైసీపీ అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ వ్యవహారంలో ఏపీలోని అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది.. అయితే, ఈ వ్యవహారంలోకి చంద్రబాబు ఫ్యామిలీని లాగుతోంది వైసీపీ.. చంద్రబాబు కుటుంబం డ్రగ్స్ బిజినెస్సులోకి దిగిందేమోననే అనుమానం వస్తోంది అంటూ హాట్ కామెంట్లు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టుబడిన ఈ సందర్భంలో లోకేష్ ఎక్కడున్నారు..? అని ప్రశ్నించిన ఆయన.. లోకేష్ దుబాయ్లో ఉన్నారని మాకు సమాచారం ఉందన్నారు. తమ డబ్బులను విదేశాల్లో దాచిన చరిత్ర చంద్రబాబు కుటుంబానిది అని.. దీనిపై దర్యాప్తు సంస్థలు అసలు నిజాలు బయటపెట్టాలని కోరారు.. తమ వ్యవహారం బయటకి రాకుండా ఉండేందుకే టీడీపీ నేతలు వైసీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ప్రపంచంలో ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వానికి.. వైసీపీకి లింక్ పెడుతూ ప్రతిపక్షం ప్రచారం చేస్తోందని.. హెరాయిన్ విషయంలో రాష్ట్రానికేం సంబంధం లేకున్నా.. అదే పనిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని.. ఇదే సందర్భంలో అదానీ మీద పడ్డారంటూ ఫైర్ అయ్యారు.
రాజమౌళి, బోయపాటిలు వీళ్లతో ఉన్నారో.. లేక తెలుగుదేశం వాళ్లే డైరెక్టర్లుగా మారారో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించిన సజ్జల… అనవసరంగా ఈ వ్యవహారంలో విజయసాయి రెడ్డి, ద్వారంపూడి పేర్లను ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్పై ఎంతో కాలంగా ఆరోపణలు చేస్తున్నా.. జనం నమ్మడం లేదు.. అయినా, ఈ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని.. అలీషా అనే వ్యక్తికి చంద్రబాబు.. ఘంటా శ్రీనివాస్ తోనే పరిచయం ఉందన్నారు.. వెతికితే చాలా పట్టుకోగలం.. వికీలీక్స్.. పారాడైజ్ పేపర్స్.. పనామా పేపర్స్.. ఇప్పుడు పండోరా పేపర్స్ అంటూ విమర్శలు చేసిన ఆయన.. పనామా పేపర్సులో హెరిటేజ్ సంస్థ ఇండిపెండెంట్ డైరెక్టర్ ప్రస్తావన ఉందని కామెంట్ చేశారు.. తెల్గీ స్కామ్, హసన్ అలీ కుంభకోణం, కోలా కృష్ణమోహన్ ఇదీ టీడీపీ చరిత్ర అంటూ ఎద్దేవా చేసిన వైసీపీ నేత… చంద్రబాబు స్వభావమే బూటకం.. జగన్పై వేసినవి తప్పుడు కేసులేనని ప్రజలు నమ్మారు కాబట్టే అధికారంలోకి వచ్చాం అన్నారు. హెరాయిన్ విషయంలో ప్రభుత్వంపై చేస్తోన్న విమర్శలపై న్యాయస్థానాలకు వెళ్తామని హెచ్చరించిన సజ్జల.. చంద్రబాబును ఎక్కడ తడిమినా అనేక కుంభకోణాలు బయటపడతాయన్నారు… ఇంటర్నేషనల్ స్కామర్సుకు కన్సల్టెంటుగా పని చేయగల సిద్దహస్తుడు చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
తాజావార్తలు
-
India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
-
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
-
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
-
Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
-
Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!