Sajjala Ramakrishna Reddy: అధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారు.. నిజమైన సంస్కరణలను తీసుకొచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డే నంటూ ప్రశంసలు కురిపించారు ప్రభుత్వ సలహాదారు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో నిర్వహించిన విశ్వబ్రాహ్మణ సంఘీయుల ఆత్మీయ సమావేశంలోఎంపీ ఆర్ కృష్ణయ్య, పలువురు ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల రామకృష్ణా రెడ్డి.. బీసీలంటే వెనుకబడిన క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్‌గా సీఎం జగన్ పేర్కొన్నారని తెలిపారు.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన ఈ వ్యాఖ్యలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలో చేసి చూపించారన్న ఆయన.. అధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారు.. నిజమైన సంస్కరణలను తీసుకుని వచ్చారు వైఎస్ జగన్ అన్నారు.. తాజాగా, 18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే అందులో 11 బీసీలకే కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. సర్పంచ్, వార్డు మెంబర్‌ల లెక్కలు తీస్తే పదివేల మంది బీసీ వర్గాల వారే ఉంటారని.. కింది స్థాయి నుంచి నాయకత్వాన్ని ప్రోత్సాహించటమే ఇది.. గతంలో ఎప్పుడూ లేనంతగా బీసీలకు ప్రాధాన్యత ఇప్పుడు ఇస్తున్నాం అని వెల్లడించారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Read Also: Mahesh Babu: దైవం మానుష రూపేణ…
కాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన విషయం విదితమే.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులుగా నత్తు రామారావు- శ్రీకాకుళం, లోకల్ కోటా (బీసీ, యాదవ), కుడుపూడి సూర్యనారాయణ- తూర్పు గోదావరి, లోకల్ కోటా (బీసీ-శెట్టి బలిజ), వంకా రవీంద్రనాథ్ – పశ్చిమ గోదావరి, లోకల్ కోటా (పారిశ్రామికవేత్త), కవురు శ్రీనివాస్ – ప.గోదావరి, లోకల్ కోటా( బీసీ-శెట్టి బలిజ), మేరుగ మురళి – నెల్లూరు, లోకల్ కోటా (ఎస్సీ-మాల), డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం-చిత్తూరు, లోకల్ కోటా, రామసుబ్బారెడ్డి – కడప, లోకల్ కోటా (ఓసీ-రెడ్డి), డాక్టర్ మధుసూదన్ – కర్నూలు, లోకల్ కోటా (బీసీ-బోయ), ఎస్. మంగమ్మ- అనంతపురం, లోకల్ కోటా( బీసీ-బోయ)ను నియమించిన సీఎం జగన్.. ఎమ్మెల్యే కోటా అభ్యర్థులుగా.. పెనుమత్స సూర్యనారాయణ- విజయనగరం, ఎమ్మెల్యే కోటా( క్షత్రియ సామాజిక వర్గం) , పోతుల సునీత- ప్రకాశం, ఎమ్మెల్యే కోటా (బీసీ- పద్మశాలి) , కోలా గురువులు-విశాఖ, ఎమ్మెల్యే కోటా (ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్), బొమ్మి ఇజ్రాయిల్.. తూర్పు గోదావరి, ఎమ్మెల్యే కోటా ( ఎస్సీ-మాదిగ), జయమంగళ వెంకటరమణ- ప. గోదావరి, లోకల్ కోటా (వడ్డీల సామాజిక వర్గం), ఏసు రత్నం- గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( బీసీ-వడ్డెర), మర్రి రాజశేఖర్- గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( కమ్మ), ఇక, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కుంభా రవి- అల్లూరి జిల్లా, (ఎస్టీ), కర్రి పద్మశ్రీ- కాకినాడ (బీసీ)గా నియమించిన విషయం తెలిసిందే.