Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: చేసిన పనులు ధైర్యంగా చెప్పి ఓట్లడుగుతాం

Sajjala 1

Sajjala 1

ఏపీలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకున్నట్టే కనిపిస్తోంది. ఇటీవల సీఎం జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అసలేం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజలకు చేసిన పనులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా చెబుతున్నాం. టీడీపీ హయాంలో ప్రజల నుంచి తిట్లు, శాపనార్ధాలు వచ్చేవి. మేము ప్రజల దగ్గరకు వెళ్ళినప్పుడు ఉత్తి మాటలు చెప్పడం లేదు. చేసిన పనులను ధైర్యంగా చెప్పగల పార్టీ బహుశా మా పార్టీ ఒక్కటే అన్నారు.

Read Also: CM KCR Yadadri Tour Live Updates: యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

సీఎం గడప గడపకు ప్రభుత్వంపై సమీక్షలో ఎమ్మెల్యేలని విమర్శించలేదు.175 టార్గెట్ పెట్టుకున్నప్పుడు విశ్వాసంతో పాటు క్రమశిక్షణ అవసరం. సీఎం వ్యాఖ్యలను నెగెటివ్‌గా ఎందుకు చూస్తున్నారు? తెలంగాణ మంత్రి హరీష్ రావు కి ఎందుకు అంత ఆవేశం వచ్చిందో అర్ధం కాలేదు. మా ప్రభుత్వాన్ని విమర్శించే గ్యాంగ్ డైరెక్షన్ లో పని చేస్తున్నారో అర్ధం కావడం లేదు. మమ్మల్ని అంటే కెసిఆర్ ని ఏమైనా అంటాం అని విమర్శలు చేస్తున్నారేమో. వాళ్లకు ఉన్న రాజకీయ సమస్యలు ఏంటో తెలియదు. తెలంగాణలో విద్యుత్ మీటర్ల ఏర్పాటుపై ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి.

మా పై విమర్శలు చేస్తే హరీష్ రావుకి మైలేజ్ ఏమైనా ఉంటుందేమో. హరీష్ రావు తన రాష్ట్రం పరిస్థితి చూసుకుంటే మంచిది. పోలవరంపై పక్క రాష్ట్రాలు అభ్యంతరం పెడితే ఇక్కడ మీడియాకి ఆనందం ఏంటి? ఒక్కరాత్రిలో మెడికల్ కాలేజ్ లు అన్ని వస్తాయా? మెడికల్ కాలేజ్ లు ఏర్పాటు కి సంబంధించి ప్రాసెస్ జరుగుతుంది. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లకు మౌలిక వసతులు కల్పించలేదు. కేబినెట్ లో మార్పులు ఏమీ ఉండవు అన్నారు సజ్జల.. ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగడం శిక్ష కాదు… బాధ్యత.. పవన్ కళ్యాణ్ ప్రజల్లో తిరగాలి.. సోషల్ మీడియాలో టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మేము అలాంటివి ప్రోత్సహించం.. మాకు మహిళలు అంటే గౌరవం ఉందన్నారు సజ్జల.

Read Also: Sitaram Yechury: రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు లోపించాయి..

Exit mobile version