ఏపీ సీఎం జగన్ కొత్త కేబినెట్ రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులంతా రాజీనామాలు చేసారు. కొత్త మంత్రి వర్గం ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనుంది. అందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ కొత్త మంత్రులు ఎవరు అన్న అంశంపై హాట్ హాట్ గా ఏపీ రాజకీయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈసారి కొత్త ముఖాలకు బాగానే చాన్సులు దొరికే అవకాశం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ ముగిసింది. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ పై సుదీర్ఘ చర్చ జరిగింది. దాదాపు మూడు గంటల సేపు జరిగిన సమావేశం జరిగింది. ఎవరిని కొనసాగించాలి…ఎవరికి అవకాశం కల్పించాలి అనే అంశం పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆశావాహుల నుంచి వస్తున్న అభ్యర్థనలు, ప్రచారంలో ఉన్న పేర్లపై వ్యక్తం అవుతున్న అభ్యంతరాల పై సమావేశంలో ముచ్చటించినట్లు సమాచారం. అయితే రేపు మరోసారి సమావేశం అయ్యే అవకాశం ఉంది.
https://ntvtelugu.com/vijayasai-reddy-made-sensational-comments-on-chandrababu/
