Site icon NTV Telugu

జల వివాదంపై మేం సంయమనంతో ఉన్నాం : సజ్జల

జలవివాదంపై మరోసారి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. తమ వైపు నుంచి పూర్తి సంయమనంతో ఉన్నామని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం భంగం కలగకుండా, పక్క రాష్ట్రంతో అనవసర వివాదాలు ఉండకూడదన్నదే తమ విధానామని పేర్కొన్నారు. కనీస నీటి మట్టం లేకుండానే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని.. రాయలసీమ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉభయ రాష్ట్రాలకు ఉందని గతంలో కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు.

read also : కొత్త పెళ్లి కూతురుకు ఈడీ నోటీసులు..!

రెండు రాష్ట్రాలు గొడవ పడే బదులు కేంద్రమే తన అధీనంలోకి తీసుకుని న్యాయం చేయటం మంచిదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించటం కోసం కొన్ని శక్తులు పని చేస్తు న్నాయనే అనుమానాలు ఉన్నాయని… అవసరమైతే ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత కేంద్రమే తీసుకోవాలని కోరతామని స్పష్టం చేశారు.

Exit mobile version