Site icon NTV Telugu

34 శాతం ఫిట్‌మెంట్ సాధ్యం కాదు : స‌జ్జ‌ల‌

ఉద్యోగుల‌కు 34 శాతం ఫిట్‌మెంట్ సాధ్యం కాదని తేల్చి చెప్పారు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. క‌రోనా, ఆర్థిక సంక్షోభం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని.. ప్రస్తుతం ఉద్యోగులకు 27శాతం ఐఆర్ ఇస్తున్నామ‌న్నారు. ఉద్యోగుల గ్రాస్ వేతనం తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు సజ్జ‌ల‌.

సీఎస్ కమిటీ సిఫార్సు చేసిన 14.29 ఐఆర్ ను అమలు చేస్తూ ఐఆర్ కు రక్షణ ఉండేలా చూస్తామ‌ని… రేపటికి పీఆర్సీ పై చర్చల ప్రక్రియ పూర్తికావచ్చన్నారు. రేపు సీఎంతో ఉద్యోగ సంఘాల చర్చలు ఉండవచ్చు లేదా సోమవారం చర్చలు.. ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కలిసిన తర్వాతే పీఆర్సీపై ప్రకటన ఉంటుంద‌ని సజ్జల ప్ర‌క‌ట‌న చేశారు. ఉద్యోగులు ఎవ‌రు కూడా ఆందోళన చెంద‌నవ‌స‌రం లేద‌ని స‌జ్జ‌ల చెప్పారు.

Exit mobile version