వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రస్థానం మొత్తం ముళ్లబాటే అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.. ఈ వేడుకల్లో పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయత ఉన్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు.. జగన్ ప్రస్థానం మొత్తం ముళ్లబాటే.. ఆయనతో పాటు కార్యకర్తలు కూడా కష్టాలు పడ్డారన్న ఆయన.. వైఎస్సార్ ఆశయాలు కొనసాగిస్తూ ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు.. తాను నమ్మిన సిద్ధాంతాల ప్రకారం వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నారని.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా లక్యం వీడకుండా జగన్ ముందుకు సాగుతున్నారని.. జగన్ వేసే ప్రతి అడుగులో విశ్వసనీయత కనిపిస్తుందని వెల్లడించారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Read Also: Atchannaidu: త్వరలోనే ఆ ముగ్గురిని పల్నాడు నుంచి తన్ని తరిమేస్తారు..!
కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాలతో సహా ఇతర దేశాల్లోనూ జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి.. గత మూడు రోజులుగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సీఎం జగన్ అభిమానులు.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.. పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్నారు.. ఇక, రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు.. గ్రామాలు ఇలా ఊరూవాడా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు.
