ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే.. త్వరలోనే మూడు రాజధానులపై చట్టం తీసుకొస్తామని తెలిపారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి… రాజధాని సంబంధించి ప్రభుత్వం, వైపీసీ స్టాండ్ కు తగ్గట్టుగానే సుప్రీంకోర్టు నిర్ణయం ఉందని భావిస్తున్నామన్న ఆయన.. మూడు రాజధానులపై పకడ్బందీగా చట్టం తీసుకువస్తామని గతంలో చట్టాన్ని వెనక్కి తీసుకున్నాం.. లేని చట్టంపై హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చిందన్నారు. రాజధానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామన్న ఆయన.. శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు.. మూడు రాజధానులకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.. అమరావతి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. రాజధాని అమరావతి పూర్తి చేసేందుకు లక్షకోట్లు పైనే కావాలని.. చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
Read Also: Bandla Ganesh: ఇక గుడ్ బై.. నాకు ఎవరితో ఏ సంబంధం లేదు..
అమరావతిలో మొత్తం ఖర్చు చేసి పూర్తిగా మునుగుదామా..? లేక రికవరి చేసే ప్రయత్నం చేద్దామా? అనేది చూడాలన్నారు సజ్జల.. రాజధాని అమరావతిలో పెట్టుబడులు వృథాకాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ఇవాళ్టికి రాజధాని అమరావతే.. త్వరలో మూడు రాజధానులపై చట్టాన్ని తీసుకు వస్తాం.. మేం ఆషామాషిగా చట్టాన్ని తీసుకుని రాలేదు.. న్యాయ ప్రక్రియకు లోబడే ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని తీసుకువస్తామన్నారు.. వికేంద్రీకరణ చేయాలన్న ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని.. న్యాయ స్థానాలు ఎలా వ్యవహరిస్తాయో చూసి చట్టం ఎప్పుడు చేయాలనే విషయమై ముందుకు వెళ్తామన్నారు.. ఇక, అమరావతిలోనే రాజధాని పెట్టాలని పార్లమెంట్ ఎక్కడా చెప్పలేదని గుర్తుచేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
