తెలుగు రాష్ట్రాల్లో విభజన రచ్చ జరుగుుతోంది. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటులో ఏపీ విభజన గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు స్పందిస్తున్నాయి. తిరుపతి పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి ముక్కంటి సేవలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర హోంశాఖ అజెండాలో ఏపీ విభజన సమస్యలు అంశాన్ని చేర్చడం సంతోషకరం అన్నారు. అది మా ఆకాంక్ష. నాడు ఏపీని అన్యాయంగా విభజించారు..ఏపీకి రావాల్సినవి ఏవీ రాలేదు. అందులో హోదా కూడా ఒకటన్నారు సజ్జల. పార్లమెంట్ లోనూ దీని కోసం మా వాయిస్ వినిపించాము. న్యాయంగా ఏపీకి దక్కాల్సిన వాటిని అందేలా చేయడం కేంద్రం బాధ్యత అని అభిప్రాయపడ్డారు. ఈ అంశం కేవలం సమావేశాలకే పరిమితం కాకూడదన్నారు.
తెలంగాణ నుంచి కూడా రావాల్సింది చాలా ఉంది. మళ్లీ న్యాయసమీక్షకు పోకుండా ఈ సమస్యను వీలైనంత త్వరగా కేంద్రం పరిష్కరించాలి. ప్రభుత్వం వైపు నుంచి పీఆర్సీ వివాదం ముగిసిందన్నారు.