Site icon NTV Telugu

ఓటీఎస్ పై విమర్శించే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు : సజ్జల

చంద్ర‌బాబుకు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. ఓటీఎస్ పై విమర్శించే నైతిక హక్కు చంద్రబాబు కు లేదని ఫైర్ అయ్యారు సజ్జ‌ల‌. పేదలందరూ దశాబ్దాలుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని.. సీఎం జగన్ చొరవతో ఇళ్ల రుణాలన్నీ మాఫీ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నారు. ఓటీఎస్ పై ప్రజలు సహాయ నిరాకరణ చేయాలని చంద్రబాబు కోరారంటే దాన్ని ఏమనాలో వారే ఆలోచించుకోవాలని చుర‌క‌లు అంటించారు. ఓటీఎస్ పథకంలో పేదలకు నష్టం కల్గించేది అంటూ ఏదీ లేదని…చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వడ్డీ మాఫీ కూడా చేయలేదని ఫైర్ అయ్యారు.

ఓటీఎస్ తో క్రయ విక్రయాలకు అవకాశం కల్గడం, వారసులకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కలుగుతుందన్నారు. పదేళ్లు తర్వాత పట్టా చేసే అవకాశాన్ని ప్రభుత్వం చట్ట సవరణ చేసిందని తెలిపారు. ఓటీఎస్ తో ప్రభుత్వానికి వచ్చేది కేవలం 4వేల కోట్లేన‌ని… పంచాయతీల్లో రిజిస్ట్రేషన్లకు ఇంటికి 10 వేలకు, మున్సి పాల్టీలో 15వేలు, కార్పోరేషన్లలో 20 వేలు చెల్లించాల్సి ఉంటుందని వెల్ల‌డించారు. ఓటీఎస్ పూర్తిగా స్వచ్చందమ‌ని… ఎవరినీ బలవంత పెట్టడం లేదని వెల్ల‌డించారు. ఓటీఎస్ పై విమర్శించే నైతిక హక్కు చంద్రబాబు కు లేద‌ని.. అన్ని ఉచితంగా చేస్తే ఉచితం అంటూ దుష్ర్పచారం చేస్తారని మండిప‌డ్డారు. పేదల నోటి కాడిది తీసేయవద్దని తెదేపాను, చంద్రబాబును కోరుతున్నాన‌ని పేర్కొన్నారు స‌జ్జ‌ల‌.

Exit mobile version