Site icon NTV Telugu

Sahithi Pharma Incident: ముగిసిన రెస్క్యూ ఆపరేషన్.. ప్రారంభమైన విచారణ

Sahithi Pharma Rescue

Sahithi Pharma Rescue

Sahithi Pharma Rescue Operation Ended: అచ్యుతాపురంలోని సాహితీ ఫార్మాలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. రెండు రియాక్టర్లు భారీ శబ్దంతో పేలడంతో, మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే.. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అలాగే.. రెస్క్యూ ఆపరేషన్ కూడా నిర్వహించారు. ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. 10 ఫైర్ ఇంజన్లు, స్కై లిఫ్టర్ల సహాయంతో.. ఐదు గంటలకు పైగా శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో.. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. కెమికల్స్‌ని అన్‌లోడ్ చేస్తున్నప్పుడు.. రసాయనాలు ఒత్తిడికి గురయ్యాయి. ఈ క్రమంలోనే కంటైనర్‌కి నిప్పు అంటుకోవడంతో, నిమిషాల్లోనే మంటలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. ఈ మంటల్లో సాహితీ ఫార్మా యూనిట్-1 మొత్తం పూర్తిగా కాలి బూడిదైంది.

Masala Mirchi Bajji : మసాలా మిర్చి బజ్జిలను ఇలా చెయ్యండి..టేస్ట్ వేరే లెవల్..

కాగా.. ఈ ఫ్యాక్టరీలో మొత్తం 35 మంది కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం సంభవించిన సమయంలో.. చాలామంది వెంటనే పరుగులు తీశారు. అయితే.. ఏడుగురికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. వారిని వెంటనే దగ్గరలోనే కేజీహెచ్‌కి తరలించారు. కానీ.. వీరిలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. చికిత్స పొందుతూ పైల సత్తిబాబు మరణించగా.. కేజీహెచ్‌కు తీసుకువస్తుండగానే, మార్గమధ్యలో తిరుపతి చనిపోయాడు. ఈ ఘటనతో సేఫ్టీ ఆడిట్ చర్చనీయాంశంగా మారింది. అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతంలో 200కు పైగా పరిశ్రమలు ఉన్నాయి. ఎక్కువ శాతం ఫార్మా, కెమికల్ ఇండస్ట్రీస్ కావడంతో.. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు.. మృతి చెందిన వారికి ఏపీ ప్రభుత్వం రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మంత్రి అమర్నాథ్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.

Prabhas – Maruthi Film: ఫాన్స్ దెబ్బకి టైటిల్ మార్చేశారా? కొత్త టైటిల్ అదేనట!

Exit mobile version