టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మబోరన్నారు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్. బాపట్ల జిల్లా పర్చూరులో జరిగిన రైతు సంఘీభావ యాత్ర లో పాల్గొన్నారు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్. అర్హతే ప్రామాణికంగా అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే అన్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ.
రాష్ట్రాభివృద్ధి, ప్రజల అవసరాల కోసం అప్పు చేసే అధికారం ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన హక్కు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అప్పులు చేయాల్సి వచ్చింది. చంద్రబాబు ఆయన పెంపుడు కొడుకు పవన్ కళ్యాణ్ ఎన్ని పొర్లు దండాలు పెట్టినా రాష్ట్ర ప్రజలు విశ్వసించే స్థితిలో లేరు. ప్రజా అభిమానంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోలేక పోయాడు. సొంతంగా ఎన్నికలకు వెళ్ళే ధైర్యం లేని చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు ఎంపీ సురేష్. చంద్రబాబు హయాంలో చనిపోయిన రైతుల కుటుంబాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించాలన్నారు.
Breaking News: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై కేసు నమోదు