రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. దీంతో ఈ సినిమాకు ప్రత్యేకంగా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసింది. అన్ని థియేటర్లు ప్రతి టికెట్‌పై రూ.75 ధర పెంచుకోవచ్చని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ జీవో విడుదల చేశారు. సినిమా రిలీజ్ కానున్న ఈ నెల 25వ తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ ప్రత్యేక ధరలు ఉంటాయని ప్రభుత్వం జీవోలో వివరించింది. టిక్కెట్ ధరలకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.
కాగా ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం ధరల పెంపు విషయంపై దరఖాస్తు వచ్చిందని ఇప్పటికే మంత్రి పేర్ని నాని వెల్లడించారు. తాము టిక్కెట్ రేట్లపై జీవో జారీ చేయడం కంటే ముందే ఈ సినిమాను నిర్మించిన కారణంగా రాష్ట్రంలో 20శాతం షూటింగ్ నిబంధన వర్తించదని మంత్రి పేర్ని నాని తెలిపారు. కొత్తగా నిర్మించే సినిమాలకు నిబంధనలు వర్తిస్తాయన్నారు.
