NTV Telugu Site icon

Opeartion Bengal Tiger: అనకాపల్లిలో పులిని బంధించేందుకు ప్రయత్నాలు

Tiger New

Tiger New

Gautam Adani : అదానీ కొత్త బిజినెస్‌..! అంబానీకి టెన్షన్‌..!

ఒకటి కాదు రెండుకాదు ఏకంగా నెలరోజులకు పైగా ఒక పులి రెండు జిల్లల వాసుల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లాలో అలజడి రేపిన బెంగాల్ టైగర్ అనకాపల్లికి చేరుకుంది. అక్కడ కూడా పశువుల్ని చంపేస్తూ రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. అనకాపలిజిల్లాలో ఆపరేషన్ రాయల్ బెంగాల్ టైగర్ వేగవంతమైంది.చాలా రోజుల తర్వాత పెద్దపులి కదలికలు ట్రాప్ కెమెరాలో చిక్కాయి. దీంతో వ్యాఘ్రాన్ని బంధించేందుకు బోనులు ఏర్పాటు చేసింది అటవీశాఖ.

అనకాపల్లిలో పెట్రోలింగ్ పెంచింది. కాకినాడ జిల్లాలో ఎగ్జిట్ ఇచ్చిన చాలా రోజుల తర్వాత బెంగాల్ టైగర్ కదలికలపై స్పష్టమైన ఆధారాలు లభించాయి. అనకాపల్లి,యలమంచిలి ఏరియాల్లో అటవీ ప్రాంతం, కొండలను ఆనుకుని ఉన్న తోటల్లోనూ తిరుగుతోంది. నీటి అవసరాలు తీర్చుకోవడం కోసం వచ్చినప్పుడు చెరువులు., కాలువల దగ్గర పగ్ మార్క్స్ నమోదయ్యాయి. కొంతమంది పులిని చూసినట్టు చెప్పినప్పటికీ ఆధారాలు లేని కారణంగా అటవీశాఖ నమ్మడంలేదు.

ఈ క్రమంలో ట్రాకింగ్ బృందాలు కశింకోట మండలం బయ్యవరం దగ్గర పెద్దపులి తిష్టవేసినట్టు గుర్తించాయి. విస్సన్నపేట శివారు  రంగబోలు  గెడ్డ , పడమటమ్మ లోవ ప్రాంతంలో పెద్దపులి రెండు రోజుల క్రితం లేగ దూడపై దాడి చేసి చంపేసింది. మిగిలిన కళేబరాన్ని తినేందుకు రాగా ట్రాప్ కెమెరాలో పక్కాగా రికార్డ్ అయింది. దీంతో పులిని బంధించేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. పెద్దపులి  సంచారంతో విస్సన్నపేట గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పశువులను మేతకు బయటకు వదలలేని పరిస్థితిలో పాడి రైతులు వున్నారు. దీంతో పశువులు ఆకలితో అలమటిస్తున్నాయి. కొద్దిరోజుల పాటు ఈ పరిస్థితి తప్పదంటున్నారు. అటవీశాఖ అధికారులు పులిని బంధించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.

Gautam Adani : అదానీ కొత్త బిజినెస్‌..! అంబానీకి టెన్షన్‌..!