Site icon NTV Telugu

Kandula Durgesh: జబర్దస్త్‌లో డాన్స్ చేసిన రోజా.. పవన్ గురించి మాట్లాడే అర్హత లేదు!

Kandula

Kandula

Kandula Durgesh: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలపై వైసీపీ తప్పుడు ప్రచారంపై మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పీపీపీ పద్ధతిలో చేపట్టిన కాలేజీల నిర్మాణం నిర్ణీత సమయంలోగా పూర్తి అవుతుందని పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తులపై పూర్తి అజమాయిషీ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అన్నారు. ఇక, వైసీపీ హయాంలో నిర్మించిన ఏ ఒక్క భవనం కూడా పూర్తి చేయలేదు అని ఆరోపించారు. అలాగే, విశాఖలోని రుషికొండపై ఆదాయం వచ్చే రిసార్ట్స్ ను పడగొట్టి రాజప్రసాదాలు నిర్మించారు అని ఎద్దేవా చేశారు. అయితే, పీపీపీ మోడ్ ను ప్రతిపక్ష నేతలు అర్థం చేసుకోవాలి అని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు.

Read Also: Aishwarya : సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసిన గ్లామరస్ బ్యూటీ.. కారణం ఇదే

అలాగే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత మాజీమంత్రి రోజాకు లేదు అని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక మంత్రిగా రోజా గతంలో రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. ఇక, పవన్ కళ్యాణ్ సినిమా నటుడుగానే విమానాల్లోనే తిరిగారు.. ఇప్పుడు మంత్రిగా విమానాల్లో తిరిగితే తప్పేంటి అని ప్రశ్నించారు. జబర్దస్త్ లో డాన్స్ వేసి రోజా చేసింది ఏమిటి?.. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే తప్పేంటి అన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ 90 శాతం ప్రజలకు సేవ చేస్తుంటే కేవలం 10 శాతం మాత్రమే సినిమాలకు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. మీలా కబ్జాలు, దొంగ వ్యాపారాలు ఉన్నాయా.. పవన్ కళ్యాణ్ కు సినిమాలు మాత్రమే ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

Read Also: Veritas Sainik School: వెరీటాస్ సైనిక్ స్కూల్ లో కీచకుడు.. విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన తెలుగు టీచర్

ఇక, రాష్ట్రంలో 10 వేల 644 కోట్ల రూపాయలతో 15 నెలల్లో.. పర్యాటక రంగానికి పెట్టుబడులు సాధించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. 8080 మందికి వీటి ద్వారా ఉపాధి లభించింది.. రూ. 698 కోట్లతో ఇప్పటికే 88 ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు. వీటి ద్వారా 3, 554 మందికి ఉపాధి లభిస్తుంది అన్నారు. దేశంలో పర్యాటక అభివృద్ధిలో పది రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. ఐదేళ్లలో 25 వేల కోట్లు పర్యాటక పెట్టుబడులు ఆకర్షించాలని చూస్తున్నాం.. రాష్ట్రంలో టూరిస్టుల కోసం హోటల్స్ పెంచాలని నిర్ణయించాం.. తూర్పు గోదావరిలో కోకో హబ్బుగా తయారు చేస్తామని మంత్రి దుర్గేష్ అన్నారు.

Exit mobile version