రోడ్డు ప్రమాదాలు విషాదం నింపుతున్నాయి. రోడ్లు నెత్తురోడుతున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యం, అతి వేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది కారు. ఆ కారులో ఉన్ననలుగురిలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.
గాయాలపాలైన యువకుల్ని స్ధానికుల సహాయంతో మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు ధృవీకరించారు వైద్యులు. మృతులు ఇద్దరు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కొత్తగూడెంకి చెందిన చైతన్య(26),ప్రణీత్(24)గా గుర్తించారు. గాయపడ్డవారు ఆస్పత్రిలో చికిత్ప అందుకుంటున్నారు. బాపట్ల సూర్యలంక బీచ్ నుండి కొత్తగూడెం వెళుతుండగా మైలవరం మండలం పుల్లూరు హైవేపై ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె- పుంగనూరు మార్గం ఓల్డ్ ఆర్‌టీఓ కార్యాలయం ఎదురుగా ఆటోను ఢీకొంది బెలేరో వాహనం…ఆటో డ్రైవర్ ప్రక్కన కూర్చున్న వెంకటేష్(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తాలూకా పోలీసులు.
ఉప్పల్ కళ్యాణపురి కాలనీ లో విషాదం
హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. ఇంటి పైకప్పున ఆరవేసిన బట్టలు తీస్తుండగా హై టెన్షన్ వైర్లు తగిలి మహిళ మృతి చెందడంతో కుటుంబలో విషాద ఛాయలు అలముకున్నాయి. మహారాష్ట్రకి చెందిన మహిళ మృతదేహం గాంధీ హాస్పిటల్ కి తరలించారు.
Read Also: India at UNHRC: ప్రజాస్వామ్యం గురించి పాకిస్తాన్ పాఠాలు అవసరం లేదు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్