ఏపీలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బుదగవి వద్ద ఇన్నోవా కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పెళ్లికి వెళ్లి కారులో బళ్లారి నుంచి అనంతపురం తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరినట్లు సమాచారం. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.
కాగా ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు కోకా వెంకటప్ప కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.