Site icon NTV Telugu

Andhra Pradesh: ఆర్‌ఎంపీ నిర్వాకం.. వాట్సాప్‌లో అమ్మకానికి పసిపాప

Rmp Doctor

Rmp Doctor

విజయవాడలో ఓ ఆర్ఎంపీ వైద్యుడు తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నాడు. నగరంలో నివసిస్తున్న అమృతరావు కొంతకాలంగా జి.కొండూరు మండలంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే అతడు వాట్సాప్ గ్రూప్ ద్వారా మూడు రోజుల పసిపాపను అమ్మకానికి పెట్టడం స్థానికంగా కలకలం రేపింది. ఈ మేరకు ఆర్ఎంపీ డాక్టర్ అమృతరావు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు.

Self Destruction Note: ప్రియుడి ఆత్మ‌హ‌త్య‌.. ఖ‌ర్చుచేసిన డ‌బ్బు కావాల‌ని లేఖ‌

రూ.3 లక్షలకు పసిపాపను అమ్మకానికి పెట్టినట్లు సదరు పోస్టుల్లో ఆర్ఎంపీ డాక్టర్ అమృతరావు పేర్కొన్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో చైల్డ్ లైన్ అధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దిశా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా గత మూడు, నాలుగు రోజులుగా ఏలూరు, మంగళగిరిలో ఇలాంటి తరహా ఘటనలు మరో రెండు వెలుగులోకి వచ్చాయి. త‌మ వ‌ద్ద డ‌బ్బులు లేక పిల్లల‌ను పోషించుకునే స్థోమత లేక బిడ్డలను మహిళలు అమ్ముకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానికులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version