NTV Telugu Site icon

Rk Roja : ఆయ‌న ప్రాణాలు తీసి.. దండ‌లు, దండం పెడుతున్నాడు

Roja

Roja

జూనియర్ ఎన్టీఆర్ కి భయపడి పార్టీ నుంచి తరిమేసారని ఆర్కే రోజా అన్నారు. ఇవాళ‌ ఏపీ ప‌ర్యాట‌క శాఖమంత్రి ఆర్కే రోజా (శ‌నివారం) ఉద‌యం నియోజ‌కవ‌ర్గ నేత‌ల‌తో క‌లిసి తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో 99 శాతం మంది ప్రజలు ప్రేమతో ఆదరిస్తూన్నారని అన్నారు. లక్షా 35 వేల కోట్లను సంక్షేమ పథకాలకు కేటాయించారని రోజా తెలిపారు.

చంద్ర‌బాబు నాయుడు ఈ రాష్ట్రానికి ప‌ట్టిన శ‌ని అని గ‌తంలోనే స్వ‌ర్గీయ ఎన్జీఆర్ అన్నారని తెలిపారు. ఆయ‌న ప్రాణాలు తీసి నేడు వారి ఫోటోకి దండ‌లు, దండం పెడుతున్నాడు అని విమ‌ర్శించారు. ఎన్టీఆర్ పేరు ఓ జిల్లాకి పెడితే.. కనీసం బాబు కృతజ్ఞత కూడా ప్రదర్శించలేదన్నారు ఆర్క్ రోజా.

సీఎం జగన్ ని మమల్ని తిట్టడానికే మహనాడు నిర్వహిస్తూన్నారని మండిప‌డ్డారు. ఎన్టిఆర్ బ్రతికే వుంటే చంద్రబాబు పరిస్థితి ఎంటో అందరికి తెలుసని రోజా అన్నారు. మహానాడులో చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా.. సీఎం వైఎస్‌ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని మంత్రి రోజా నిప్పులు చెరిగారు. అంబేద్కర్ పేరు పెడితే దళిత మంత్రి, బిసి ఎమ్మేల్యే ఇళ్లను టీడీపీ, జనసేనా నాయకులు కాల్చివేసారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇక మంత్రి విశ్వరూప్ ఇంటిపై జరిగిన దాడిని అమానుష చర్యగా అభివర్ణించిన ఆమె… అల్లర్లను అణచివేయడానికి పోలీసులు ఎంతో సమన్వయంగా వ్యవహరించారని మెచ్చుకున్నారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లు ఎంతటి వాళ్లు అయినా వదిలేదేలే అని స్పష్టం చేశారు మంత్రి రోజా.

టీడీపీ రధం చక్రాలు ఊడిపోయాయి : మంత్రి మేరుగ నాగార్జున