NTV Telugu Site icon

ఒంగోలు రిమ్స్ కాలేజీలో కరోనా టెర్రర్

ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. తాజాగా ఒంగోలు రిమ్స్ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం రేపుతోంది. 20 మందికి పైగా మొదటి సంవత్సరం మెడికల్ విద్యార్థులకు కరోనా పొజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మిగిలిన విద్యార్దులు, అధ్యాపకులు ఆందోళనకు గురవుతున్నారు.

మొదటి సంవత్సరంలో మొత్తం 120 మంది విద్యార్థులు వున్నారు. కొంతమందిని హోం ఐసోలేషన్ కు తరలించారు అధికారులు. మరికొంత మందికి రిమ్స్ లోనే చికిత్స అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కరోనా బారిన పడుతున్నారు మెడికోలు. మరో నాలుగు రోజుల్లో పరీక్షలు ఉండటంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. యూనివర్సిటీ అధికారులు పరీక్షలు వాయిదా వేయాలంటున్నారు విద్యార్ధులు.

ఇదిలా వుండగా ఏపీ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 14,440 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,80, 634 కి పెరిగింది.ఒక్క రోజు వ్యవధిలో మరో నలుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 542 కి చేరింది. కాలేజీలు, స్కూళ్ళలో కరోనా బారినపడుతున్న వారు పెరిగిపోతున్నారు. ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతుండడంతో ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది.