2024 ఎన్నికలకు సిద్ధం అవుతోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వైసీపీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసిన పార్టీ అధినేత వైఎస్ జగన్.. రాష్ట్రంలోని 175 స్థానాల్లో 175 ఎందుకు గెలవకూడదు అని ప్రశ్నించారు.. దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సెటైర్లు వేస్తోంది… సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి… రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ పార్టీకి 175 స్థానాలు ఎలా వస్తాయి..? అని ప్రశ్నించారు.. 10 స్థానాలు కూడా గెలవలేమనే భయంతో వైసీపీ ఎమ్మెల్యేలుంటే.. 175 స్థానాలు గెలవాలని జగన్ అనడం విడ్డూరంగా ఉందన్న ఆయన.. సీఎం గ్రాఫ్ పావలాకు పడిపోయినందున వచ్చే ఎన్నికల్లో బీఫామ్ ఇవ్వకుంటే చాలన్నట్లు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని ఎద్దేవా చేశారు.
Read Also: Madhu Yashki Goud : రాష్ట్రంకు అప్పులు.. కేసీఆర్‌కు గొప్పలు.. జనంకు తిప్పలు
ప్రజలింకా తనకే ఓట్లేస్తారనే భ్రమలో సీఎం ఉన్నారా? అని అని ప్రశ్నించారు శ్రీనివాస్ రెడ్డి.. రాష్ట్రాన్ని అథమ స్థానానికి తీసుకెళ్లినందుకు 175 స్థానాలు వస్తాయా..? చెత్త పన్నులు వేసినందుకు, రైతుల ఆంక్రదనలు విన్నందుకు, విద్యుత్ కోతలు విధిస్తూ ఛార్జీలు పెంచినందుకు, ఆర్టీసీ చార్జీలు, నిత్యావసరాలు బాదుడే బాదుడుకు 175 స్థానాలు వస్తాయా..? అని నిలదీసిన ఆయన.. 175 కాదు పదిహేడున్నర సీట్లు వైసీపీ గెలిస్తే గొప్పే నంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక, పులివెందులలో పెట్టక పెట్టక పెట్టిన ఆక్వా హబ్ నెలన్నరకే మూతపడేలా చేశారు ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి అభివృద్ధి లేదు.. కానీ, మాజీ మంత్రుల ప్రోటోకాల్ కోసం కొత్త బోర్డులు సృష్టిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి.