Site icon NTV Telugu

Ravinuthala Govardhan Sharma: సమాచార హక్కు కార్యకర్తల సంఘం జిల్లా కన్వీనర్‌గా గోవర్ధన్ నియామకం

Guntur Govardhan Reddy

Guntur Govardhan Reddy

Ravinuthala Govardhan Sharma: గుంటూరు జిల్లా నల్లపాడు మండలం వెంగళపాలెం గ్రామానికి రావినూతల గోవర్ధన్ శర్మ జిల్లా కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు సమాచార హక్కు కార్యకర్తల సంఘం వ్యవస్థాపకులు ముత్తు శుక్రవారం నాడు అధికారకంగా ప్రకటించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ శర్మ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా సమాచార హక్కు చట్టం కార్యకర్తలను ఒక వేదికపై తీసుకొచ్చి, సమాచార హక్కు చట్టం గ్రామ స్థాయిలో ప్రచారం చేయడానికి సంస్థ తరుపున కృషి చేస్తామని తెలిపారు. అదే విధంగా.. ప్రతి మండలంలో ఈ చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించి, ప్రజలను చైతన్యం చేస్తానని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం సమాచారం సేకరించి, అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకునే విధంగా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా తనను జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించినందుకు.. సంస్థ వ్యవస్థాపకులు ముత్తుకి, సహకరించిన రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆంజనేయులు, జీ నరేంద్ర గుప్తకి కృతజ్ఞతలు తెలియజేశారు.

Sunday Funday: హమ్మయ్య టైం వచ్చేసింది.. పదండి ట్యాంక్‌ బండ్‌ కెళ్లి ఎంజాయ్‌ చేద్దాం

Exit mobile version