తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. 2020 జూలై 20న ప్రమాదానికి గురైన అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడుకు చెందిన సూర్య కు అరుదైన శస్త్ర చికిత్స చేశారు బర్డ్ వైద్యులు. బీటెక్ పూర్తి చేసి హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న 29 ఏళ్ల సూర్య ఒంటిమిట్ట వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదం కారణంగా రెండు నెలలు కోమాలో ఉన్నాడు సూర్య. విశాఖ లోని సింహాద్రి ఆసుపత్రిలో చికిత్స పొందిన సూర్య రెండేళ్లుగా ఎవరినీ గుర్తించని పరిస్థితి నెలకొంది.
Read Also: Balakrishna Fire On NTR Health Varsity issue Live: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
వినికిడి శబ్దంతో పాటు వినలేని మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న సూర్యకు అరుదైన చికిత్స అవసరం అయింది. ఈ నెల 20న తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో సూర్యకు కాంక్లియర్ ఇన్ప్లాంట్ అమర్చి శస్త్ర చికిత్స పూర్తిచేశారు వైద్యులు. ఈ ఏడాది మే నెలలో సిఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా కాంక్లియర్ ఇన్ ప్లాంట్ చికిత్స ప్రారంభించారు వైద్యులు. ఖరీదైన ఆపరేషన్ ను ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా నిర్వహించారు బర్డ్ ఆసుపత్రి వర్గాలు. ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పటిదాకా 20 మంది ఆపరేషన్ కోసం నమోదు చేసుకున్నారని, తొలి ఆపరేషన్ సూర్య కు నిర్వహించి సక్సెస్ చేసిన బర్డ్ వైద్యులను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అభినందించారు. ఈ చికిత్సకు ఏడు లక్షలు ఖర్చు చేసింది బర్డ్ ఆస్పత్రి.
