Site icon NTV Telugu

Thopudurthi Prakash Reddy: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబును ఉరితీయాలి..!

Thopudurthi Prakash Reddy

Thopudurthi Prakash Reddy

Thopudurthi Prakash Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు వేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబును ఉరితీయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు హయాంలోనే కర్నాటక అక్రమ ప్రాజెక్టులకు పునాది పడిందని విమర్శించారు.. చంద్రబాబు పాలనలో ఏపీలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని. కర్నాటక అక్రమ ప్రాజెక్టులకు చంద్రబాబు ఏనాడూ అభ్యంతరం చెప్పలేదని ఆరోపించారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచినా చంద్రబాబు నోరు మెదపలేదు.. అప్పర్ భద్ర ప్రాజెక్టు కు నీటి కేటాయింపుకు 2011లోనే కోర్టు స్టే ఇచ్చిందని.. 2017లో ఫారెస్ట్ క్లియరెన్స్, రెండో విడత అప్పర్ భద్ర ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని.. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదని ఆరోపించారు.

Read Also: INDvsAUS 1st Test: ముగిసిన తొలిరోజు ఆట.. టీమిండియా 77/1

అయితే, అప్పర్ భద్ర ప్రాజెక్టుపై వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతూనే ఉందని గుర్తుచేశారు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి.. అప్పర్ భద్రపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తోందన్న ఆయన.. ప్రాజెక్టు ఆపేందుకు సుప్రీంకో లో వైఎస్‌ జగన్ సర్కారు బలమైన వాదనలు వినిపిస్తోందని తెలిపారు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబును ఉరితీయాలంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి.. కాగా, గతంలోనూ చంద్రబాబుపై హాట్‌ కామెంట్లు చేశారు తోపుదుర్తి.. జాకీ పరిశ్రమ విషయంలో టీడీపీ మండిపడిన విషయం విదితమే కాగా.. ఇక, తనను, లోకేష్‌ను చంపేస్తారట అంటూ మాట్లాడిన చంద్రబాబు మాటలకు గతంలె కౌంటర్ ఇచ్చారు. కాటికి కాలు చాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికీ లేదన్నారు.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 150 హత్యలు జరిగాయని ఎమ్మెల్యే ఆరోపించారు. పరిటాల రవి హయాంలో ఎన్ని హత్యలు జరిగాయో అందరికీ తెలుసన్నారు. పరిటాల రవి అనుచరుడు జగ్గుతో అమ్మను తిట్టించారని.. కొడుకులుగా మాకు బాధ ఉండదా..? అంటూ ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే.

Exit mobile version