Site icon NTV Telugu

చంద్రబాబుకు జెడ్ ప్లస్ కంటే ఎక్కువ భద్రత కల్పించాలి…

కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాని కలిశారు తెదేపా ఎంపీలు. చంద్రబాబు సభపై రాళ్ల దాడి, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేసారు అని రామ్మోహన్ నాయుడు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రచార సభపై రాళ్ల దాడి జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం విచ్చలవిడిగా జరుగుతోంది. కేంద్ర హోంశాఖ సరైన చర్యలు తీసుకోవాలని కోరాం. మాజీ ముఖ్యమంత్రి అన్ని అనుమతులు తీసుకొని నిర్వహించిన సభపై రాళ్ల దాడి జరిగింది. రాష్ట్ర పోలీసుల లోపం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. దీనికి కారణమైన వారిపై కేంద్రం చర్యలు తీసుకోవాలి. చంద్రబాబుకు జెడ్ ప్లస్ ఉన్నా ఇంకా అదనపు బలగాలతో భద్రత కల్పించాలి. పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరాం.  ఎన్నికలకు కేంద్ర బలగాలను పంపేందుకు అజయ్ భల్లా హామీ ఇచ్చారు అని తెలిపారు. 

Exit mobile version