Site icon NTV Telugu

జగన్‌ ప్రభుత్వం గాడి తప్పింది : సీపీఐ రామకృష్ణ

ఏపీలో రాజకీయ పరిస్థితులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో గాడి తప్పిందని ఆయన అన్నారు. అంతేకాకుండా జగన్‌ ప్రభుత్వం దివాళా దిశగా సాగుతోందని, అప్పులు తీసుకువస్తే తప్పా రాష్ట్రానికి మనుగడలేని దుర్భర పరిస్థితిలు నెలకొన్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఇసుక, ఇటుక, ఉక్కు ధరలు పెరిగి సామాన్యుడికి అందని ద్రాక్షలా మారాయన్నారు.

జగన్‌ ప్రభుత్వం తిరోగమన చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. ఎన్నికల్లో హామీలు గుప్పించిన జగన్‌ వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు ఉన్నా ఏపీకి ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్‌లో మాట్లాడే వారేలేరన్నారు. ఈ పరిస్థితి రావడానికి అదే ప్రధాన కారణమని ఆయన చెప్పకొచ్చారు.

Exit mobile version