ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించిన ఉద్యోగులు.. ఇవాళ ఛలో విజయవాడతో హడలెత్తించారు.. ఎక్కడ చూసి జనసందోహమే.. ఎక్కడ విన్నా తమ డిమాండ్లతో నినాదాలే.. ఓవైపు ఎండ మండిపోతున్నా.. నడీ రోడ్లపై కూర్చొని.. నిలబడి.. నినాదాలతో హోరెత్తించారు ఉద్యోగులు.. ఛలో విజయవాడ తర్వాత మరోసారి చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వం.. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకుందాం.. సమ్మెలు, ఆందోళనతో ఏం సాధించలేరని ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న కామెంట్లు.. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంగతేమో గానీ.. విజయవాడలో జన సందోహాన్ని చూసి సంచనల దర్శకుడు రాంగోపాల్ వర్మకు చలి జ్వరం వచ్చేసిందట..
Read Also: ఒవైసీ కారుపై కాల్పులు.. హైదరాబాద్‌లో అలెర్ట్..
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆర్జీవీ.. ఇవాళ ఉద్యోగుల ఛలో విజయవాడపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం నాక్ షాక్.. ఇలా ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? అని నా సందేహం.. అంటూ ఓ ఫొటోను షేర్ చేస్తూ ట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ… ఏపీ సర్కార్ సంగతేమో గానీ విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు భయంతో చలి జ్వరం వచ్చేసింది.. అంటూ చలో విజయవాడకు సంబంధించిన మరో ఫొటోను షేర్ చేస్తూ.. రెండో ట్వీట్ చేశారు..