NTV Telugu Site icon

R Krishnaiah: పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలి

R Krishnaiah

R Krishnaiah

R Krishnaiah: వెనుకబడిన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని, జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. దేశంలోని బీసీ హక్కుల పరిరక్షణ కోసం ఆగస్టు 2, 3, 4 తేదీలు, ఆ తర్వాత ఆగస్టు 9,10,11 తేదీల్లో పార్లమెంట్ వద్ద ధర్నా చేపడతామని డిమాండ్ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో యువత విడతల వారీగా జరిగే ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు.

Chandrababu: పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి.. సీఎస్‌కు లేఖ రాసిన చంద్రబాబు

దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు, నిరుద్యోగ యువత పాల్గొనబోతున్నారని పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోరాటాలు చేసి విద్య, ఉద్యోగ విషయాల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి హక్కులను పరిరక్షించుకున్నామన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రతి ఏడాది సుమారు 30 లక్షల మందికి పైగా వెనకబడిన కులాల విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ప్రయోజనాలు పొందుతున్నారన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బీసీలకు ఇలాంటి అవకాశం లేకపోవడం వల్ల యువత ఇంకా వెనుకబడి ఉన్నారని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.