NTV Telugu Site icon

Rajinikanth At Ameenpeer dargah: అమీన్ పీర్ దర్గాలో రజనీకాంత్, రెహమాన్ సందడి

Rajini

Rajini

కడప అమీన్ పీర్ దర్గాలో సందడి చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్. అమీన్ పీర్ దర్గా సందర్శనకు కుటుంబ సభ్యులతో కడప చేరుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్…మొదట అమీన్ పీర్ దర్గా పీఠాధిపతిని కలిశారు రజనీ కాంత్..చెన్నై నుంచి విమానంలో కడప చేరుకున్న ఏ అర్ రెహమాన్ కూడా పెద్ద దర్గాను సందర్శించారు.పెద్ద దర్గాలో ప్రార్థన చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్.

పెద్ద దర్గాలో రజనీకాంత్ ఆయన కుమార్తె ఐశ్వర్య, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన కుమారుడు అమీన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నలుగురు కలిసి పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో అక్కడ భారీ కోలాహలం నెలకొంది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కడప పెద్ద దర్గాకు తొలిసారి వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఘన స్వాగతం పలికారు. అభిమానులు సందడి చేశారు.

అంతకంటే ముందు తిరుమలకు వెళ్లారు రజనీకాంత్. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు సూపర్ స్టార్. తన కుమార్తె ఐశ్వర్య కూడా రజనీకాంత్‌ తో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం.. రజనీకాంత్‌ దంపతులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.పెద్ద దర్గా విశిష్టతను ప్రతినిధులు రజనీకాంత్ కు ఏ ఆర్ రెహమాన్ కు తెలియజేశారు. దర్గా సంప్రదాయం ప్రకారం ఏ ఆర్ రెహమాన్ కు రజనీకాంత్ కు తలపాగ చుట్టారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థన చేసుకునే విధంగా అవకాశం కల్పించారు. దాదాపు రెండు గంటలపాటు రజనీకాంత్ ఏఆర్ రెహమాన్ పెద్ద దర్గాలోనే గడిపారు. మధ్యాహ్నం కడప విమానాశ్రయం నుంచి విమానంలో చెన్నైకి బయలుదేరి వెళ్లారు…

Show comments