Site icon NTV Telugu

Rajat Bhargava: ఏపీలో 840 బార్లకు మాత్రమే పర్మిషన్

Ap Excise

Ap Excise

ఏపీలో బార్ల లైసెన్సుల జారీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు అబ్కారీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ చెప్పారు. ఇ-ఆక్షన్ ద్వారా పారదర్శకంగా ఆన్ లైన్ లో వేలం ప్రక్రియ నిర్వహిస్తాం. మొత్తం 840 బార్ లకు మించి అదనంగా ఒక్క లైసెన్సు కూడా జారీ చేయబోం. కొత్తగా ఏర్పాటైన మున్సిపాల్టీలు, నగర పంచాయితీల్లో ఈ బార్లను సర్దుబాటు చేస్తాం. డిమాండ్ ఉన్న మద్యం బ్రాండ్లు ఏపీలో విక్రయించేందుకు ఆయా సంస్థలతో మాట్లాడుతున్నాం

కింగ్ ఫిషర్ లోనే 9 బ్రాండ్లు ఉన్నాయన్నారు. ఫోస్టర్, హెంకెన్ తదితర కంపెనీలకు ఇతర రాష్ట్రాల్లో సరఫరా ఉంది.. వెంటనే అక్కడ ఆపేసి ఏపీకి ఇవ్వరు. ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ మద్యం సరఫరాకు సంబంధించి 181 ప్రమాణాల్ని పాటిస్తుంది. ఆదాయం, కొనుగోళ్లు, వేలం తదితర అంశాలపై త్వరలోనే అన్నీ వెబ్ సైట్ లో ఉంచుతాం. మద్యానికి సంబంధించి ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యపానం గణనీయంగా తగ్గిందన్నారు రజత్ భార్గవ. రాష్ట్రంలో సేవించే మద్యాన్ని కెమికల్ ల్యాబ్స్ లో పరీక్షించాకే అనుమతి ఇస్తాం.

ఎక్కువ సంఖ్యలోనే నమూనాల్ని పరీక్షించిన తర్వాత విక్రయానికి అనుమతిస్తున్నాం. ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ లో పారదర్శకత కోసం అంతర్గత ఆడిట్ , బయటి ఆడిట్ కూడా నిర్వహిస్తున్నాం. త్వరలోనే కార్పోరేషన్ బోర్డులో చార్టెడ్ అకౌంటెంట్ తో పాటు రెండు స్వతంత్ర డైరెక్టర్లను కూడా నియమిస్తాం. బోర్డులో ఓ మహిళా డైరెక్టర్ కూడా నియమించాలని భావిస్తున్నాం అని తెలిపారు రజత్ భార్గవ.

మరోవైపు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాసిన నాటకం ప్రదర్శన వుంటుందన్నారు రజత్ భార్గవ. జూలై 17 తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ రాసిన నాటకాన్ని కళాకారులు ప్రదర్శిస్తారు.1803లో బ్రిటీషర్లతో ఓడిశాలోని స్వాతంత్ర్య సమరయోధుడు బక్సీ జగబంధు చేసిన పోరాటంపై నాటకం రాసిన నాటకం.మహా సంగ్రామర్ మహా నాయక్ పేరిట నాటకాన్ని రాసిన గవర్నర్ బిశ్వభూషణ్.ఒడియా భాషలోనే నాటక ప్రదర్శన దానికి అనుగుణంగా అనువాద ప్రక్రియ వుంటుందన్నారు రజత్ భార్గవ.

Rahul Gandhi: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు.. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర

Exit mobile version