NTV Telugu Site icon

Heavy Rains Alert: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వాన.. మరో రెండ్రోజుల పాటు వర్షాలు..

Hevay Rain Alert

Hevay Rain Alert

Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారా హిల్స్, మాధాపూర్, హైటెక్స్ సిటీ, పంజాగుట్ట, అమీర్ పేట్ పలు ప్రాంతాలలో వాన కురుస్తుంది. గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా వర్షం కాస్త ఊరటనిచ్చింది. భారీ వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Read also: VVS Laxman: మరో ఏడాది జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతిగా పదవీకాలం పొడిగింపు..

ఆగస్టు 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సూర్యాపేట, మహబూబ్, వరంగల్, సూర్యపేట, హనుమకొండ, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Read also: CM Revanth Reddy: ఢిల్లీలో విదేశీ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం..

గురువారం రాత్రి 9 గంటల వరకు సికింద్రాబాద్‌లోని పాటిగడ్డలో అత్యధికంగా 74.8 మి.మీ, బన్సీలాల్‌పేటలో 73.0 మి.మీ వర్షం కురిసింది. వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్) అధికారులు వెల్లడించారు. ముషీరాబాద్‌లో 73, రామచంద్రాపురంలో 68.5, కూకట్‌పల్లిలో 64.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాల విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 93.5 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లాలో 87 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారులు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే, దయచేసి 040-21111111 లేదా 9000113667కు కాల్ చేయండి.
Vikarabad Crime: దారుణం.. దళిత మహిళపై ఎస్ఐ చిత్రహింసలు..

Show comments