ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ కేంద్రం.. ఈ రోజు, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపోఆవరణములో దక్షిణ మరియు నైరుతి గాలులు వీస్తున్నాయని.. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన ఇలా ఉండనుంది.. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాంలో.. ఈరోజు, రేపు మరియు ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉండగా.. రేపు మరియు ఎల్లుండి ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు పడతాయని పేర్కొంది.
Read Also: MMTS Services: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. సర్వీసులు పెంచిన ఎంఎంటీఎస్..
ఇక, దక్షిణ కోస్తా ఆంధ్రలో ఈరోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.. రేపు మరియు ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉండగా.. రాయలసీమలో ఈరోజ తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని.. రేపు మరియు ఎల్లుండి తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని.. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
