Visakhapatnam: కంటకాపల్లి దగ్గర జరిగిన రైలు ప్రమాదం పైన విచారణ ప్రారంభమైంది. కాగా విశాఖ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మొదటగా డివిజన్ పరిధిలోని లోకో పైలట్లు, వివిధ డిపార్ట్మెంట్ ల సిబ్బంది హాజరు అయ్యారు. విచారణ సమయంలో లోకో పైలట్లు వాళ్ళు ఎదుర్కుంటున్న సమస్యల గురించి విచారణ అధికారులకు విన్నవించుకున్నారు. ఆటో సిగ్నల్ వ్యవస్థ పనితీరు, లోకో పైలట్లు ఎదుర్కుంటున్న ఇబ్బందుల గురించి విచారణ అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. కాగా రేపు మరి కొంతమంది సాక్షులను రైల్వే సేఫ్టీ అధికారులు విచారించనున్నారు.
Read also:Governor Abdul Nazeer: ప్రజల మనసు గెలిచిన మహానేత వైఎస్‌ఆర్
ఆదివారం రాత్రి విజయనగరం జిల్లా లోని అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగిఉన్న రైలు ను వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు ఢీ కొట్టింది.ఈ ఘటనలో 5 బోగీలు పట్టాలు తప్పాయి. దీనితో ఆ 5 బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో 14 మందికి పైగా మరణించగా 50 మందికి పైగా గాయ పడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సహాయక చర్యల్లో మంత్రి బొత్సా సత్యనారాయణ, అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాకి సమీప జిల్లాలు అయినా విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మెరుగైన వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
Read also:Exit Poll: నవంబర్ 30 సాయంత్రం 6.30 వరకు.. ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ నిషేధం..
అయితే ప్రస్తుతం మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. కాగా రైలు ప్రమాద మృతుల్లో నలుగురు రైల్వే ఉద్యోగులు కూడా ఉన్నారు. రాయగడ పాసింజర్ లో పైలట్ మధు సూధన రావ్ తో పాటు అసిస్టెంట్ లోకో పైలట్ చిరంజీవి కూడా ఘటనా స్థలం లోనే మృతి చెందారు. అలానే పలాస పాసింజర్ గార్డ్ ఎం శ్రీనివాస్ రావ్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న రైల్వే గాంగ్ మెన్ కృష్ణం నాయుడు కూడా మరణించారు.
