NTV Telugu Site icon

అలా జరుగకముందే ఏపీకి కేంద్ర బలగాలు పంపండి : రఘురామరాజు

ఏపీలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖలు రాశారు. టీడీపీ కార్యాలయంపై దాడులను ఖండిస్తూ ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్‌ కోవిండ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిషా లకు లేఖలు రాశారు. ఈ దాడులపై విచారణ చేపట్టేందుకు సీబీఐ, ఎన్‌ఐఏలను రంగంలోకి దించాలని కోరారు.

అంతేకాకుండా ఇలానే ఉంటే ఏపీ పరిస్థితులు మరింత దిగజారిపోతాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పోలీసులపై నమ్మకం పోయిందని, వెంటనే కేంద్ర బలగాలను రాష్ట్రంలో దించాలని కోరారు. దీనితో పాటు టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మరెడ్డి పట్టాభిరామ్‌ ఇంటిపై దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు.