NTV Telugu Site icon

ర్యాగింగ్ త‌ట్టుకోలేక‌పోతున్నాం.. యాక్ష‌న్ తీసుకోండి.. జేఎన్టీయూ విద్యార్థి విజ్ఞ‌ప్తి

ఉన్న‌త విద్యా వేదిక‌లైన యూనివ‌ర్సిటీల‌ను ఇంకా ర్యాగింగ్ బూతం వెంటాడుతూనే ఉంది.. వ‌ర్సిటీల్లో, కాలేజీల్లో, హాస్ట‌ళ్ల‌లో ర్యాగింగ్ పై నిషేధాన్ని విధించినా కొన్ని చోట్ల ఇంకా ర్యాగింగ్ కొన‌సాగ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం.. తాజాగా, సోష‌ల్ మీడియా వేదిక‌గా జేఎన్టీయూ విజ‌య‌న‌గ‌రం క్యాంప‌స్ విద్యార్థి త‌న గోడు వెల్ల‌బోసుకున్నారు..

Read Also: కొత్త ఒక వింత .. ఈ ఆధార్ కార్డు ఉంటేనే పెళ్లికి ఎంట్రీ..!

నా పేరు శ్రీ‌నివాస్‌.. నేను బీటెక్ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్నాను. మా హాస్టళ్లలో ర్యాగింగ్ తీవ్ర‌స్థాయిలో ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.. క‌నీసం సీసీ కెమెరాలు లేవు.. మా క్యాంపస్‌లోకి సీనియర్లు వచ్చినా వార్డెన్లు స్పందించ‌డం లేద‌ని వాపోయాడు.. కాలేజీ పూర్తి కాగానే సీనియర్లు మా వద్దకు వ‌స్తున్నారు.. క్లాస్ అయిన 30 నిమిషాల త‌ర్వాత వ‌చ్చి రాత్రి వ‌ర‌కు ఉండి ఇబ్బంది పెడుతున్నారు.. పాటలు పాడ‌మంటారు, డ్యాన్స్ చేయ‌మంటారు.. చికెన్, చేపలు మెస్ నుంచి తీసుకురావాల‌ని ఒత్తిడి చేస్తారు.. తెచ్చేవ‌ర‌కు ఊరుకోరు అని.. ఇలా అనేక ర‌కాలుగా ర్యాంగింగ్ చేస్తున్నార‌ని.. అలాంటప్పుడు మేం సెమిస్టర్ పరీక్షల‌కు ఎలా ప్రిపేర్ కావాలి.. రోజు వారి క్లాసుల‌ను ఎలా ఎదుర్కోవాలి? అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.. ఇక‌, ఈ విష‌యంలో సీనియ‌ర్ల‌పై ఫిర్యాదు చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.. పైగా సార్ల‌కు ఫిర్యాదు చేస్తే.. మా పేర్ల‌ను సీనియ‌ర్ల‌కు చెబుతున్నారు.. మాకు ఈ ర్యాగింగ్ వ‌ద్దు.. ద‌య‌చేసి వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోండి అని విజ్ఞ‌ప్తి చేశాడు.