NTV Telugu Site icon

వాలాంటీర్ల సత్కర కార్యక్రమంలో పుష్ప శ్రీవాణి హాట్ కామెంట్స్

వాలాంటీర్లకు సత్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి హాట్ కామెంట్స్ చేశారు. పలువరు వాలంటీర్లపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో వైసీపీకి, జగన్ కు వ్యతిరేకంగా బహిరంగంగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. కురుపాం మండలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని, గరుగుబిల్లి మండలంలో ఒక వాలంటీర్ భర్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారని ఆమె ఫైర్ అయ్యారు. 90 శాతం మంది ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని, 10 శాతం ప్రభుత్వానికి వ్యతిరేక శక్తులు గా పనిచేస్తున్నారని ఆమె అన్నారు. వాలంటీర్ లకు గుర్తింపు లభించింది అంటే కేవలం సీఎం జగన్ వల్లే.. అది గుర్తుపెట్టుకోవాలని ఆమె అన్నారు.