అసెంబ్లీ ఎపిసోడ్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి మరోసారి స్పందించారు. అసెంబ్లీ అనేది చట్టాలు చేసే పవిత్రమైన స్థలమని… అసెంబ్లీలో భాష ఏ మేరకు దిగజారిందో ప్రజలంతా చూస్తున్నారని ఫైర్ అయ్యారు. సభ లో భిన్నమైన వాతావరణం ఉంది.. ప్రజా సమస్యలపై కాకుండా వేరే రకమైన చర్చ జరుగుతోంది.. ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు పురంధేశ్వరి. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని… విభజన చట్డంలోని 90 శాతం అంశాలు పూర్తయ్యాయని ఆమె వెల్లడించారు.
ఎవరూ ఊహించని విధంగా కేంద్రం ఏపీకి అనేక విధాలుగా సహకరిస్తుందని… ఏపీకి నిధులిచ్చే విషయంలో కేంద్రం ఎక్కడా మడప తిప్పలేదన్నారు. ఏపీ ఆర్ధిక స్ధితి సరిగా లేకపోతే కేంద్రమే నిధులిచ్చిందని.. కేంద్రం నిధుల వల్లే ఏపీలో అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. అమరావతికి కట్టుబడి ఉన్నామని గతంలోనే ప్రకటించాం.. ఇప్పుడు ప్రత్యక్షంగా పాల్గొంటున్నామని వెల్లడించారు. రైతులపై దాడులు సరికాదన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం రూ. 1500 కోట్లు కేటాయించిందని.. అమరావతికి బీజేపీ సహకరించడం లేదనే మాట అవాస్తవమని వెల్లడించారు. వరద వచ్చిన తర్వాత నష్టం పై కేంద్రానికి సీఎం నివేదికవ్వాలన్నారు.
